టీఎస్ ఎంసెట్-2018 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2018 దరఖాస్తు ప్రక్రియ మార్చి 4 నుంచి ప్రారంభ మైంది. ఫిబ్రవరి 27న ఎంసెట్ నోటిఫికేషన్ జారీచేసిన తెలంగాణ ఉన్నత విద్యామండలి, ఫిబ్రవరి 28 నుంచి విద్యార్థులకు అందుబాటులో ఉంచింది.
దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 4 వరకు కొనసాగుతుంది. ఏప్రిల్ 6 నుంచి 9వరకు దరఖాస్తులో పొరపాట్లు సరిదిద్దుకునేందుకు టీఎస్‌సీహెచ్‌ఈ అవకాశం కల్పించింది. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 11, రూ.వెయి్య ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18, రూ.5 వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 24, రూ.10 వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వీలుంది. ఏప్రిల్ 20వ తేదీనుంచి మే1 వరకు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 2 నుంచి మే 7 వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి.
Published date : 05 Mar 2018 01:38PM