Skip to main content

టీ ఎస్ ఎంసెట్ హాల్‌టికెట్లు ... సెప్టెంబర్ 9, 10, 11, 14 తేదీల్లో పరీక్షలు

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులు నేటి నుంచి (ఈ నెల 3వ తేదీ) హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్ తెలిపారు.

హాల్‌టికెట్లను తమ వెబ్‌సైట్‌లో (https://eamcet.tsche.ac.in) అందుబాటులో ఉంచామని, 7వ తేదీ వరకు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.

టీ ఎస్ ఎంసెట్2020 ప్రాక్టీస్ టెస్ట్స్, మాక్ టెస్ట్స్, ఆన్‌లైన్ టెస్ట్స్, కాలేజ్ ప్రెడిక్టర్, కౌన్సిలింగ్, స్టడీమెటీరియల్, ఎక్స్‌పర్ట్స్ గెడైన్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి.

ఈ నెల 9, 10, 11, 14 తేదీల్లో నిర్వహించనున్న ఇంజనీరింగ్ ఎంసెట్‌కు 1,43,165 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్షల కోసం తెలంగాణలో 79, ఆంధ్రప్రదేశ్‌లో 23 మొత్తం 102 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు ఆన్‌లైన్ టెస్టును ప్రాక్టీస్ చేసుకునేందుకు మాక్ టెస్టు లింకును కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. విద్యార్థులు వీలైతే పరీక్ష కేంద్రాలను ముందుగానే వెళ్లి చూసుకోవాలని, సెంటర్ లొకేటర్ యాప్ ద్వారా పరీక్ష కేంద్రానికి చేరుకోవచ్చని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్‌తో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు.

హాల్‌టికెట్లు కోసం క్లిక్ చేయండి

Published date : 03 Sep 2020 12:37PM

Photo Stories