Skip to main content

తెలంగాణలో ఇంజనీరింగ్ స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు జారీ

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి కాలేజీలకు మార్గదర్శకాలు జారీ చేసింది.
మిగిలిపోయిన సీట్లు, భర్తీ అయిన సీట్ల వివరాలను tseamcet.nic.in వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆయా కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ చర్యలు చేపట్టినట్లు మంగళవారం ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. అలాగే స్పాట్ అడ్మిషన్లలో కాలేజీలు పాటించాల్సిన నిబంధనలను tseamcetd.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. మార్గదర్శకాల ప్రకారమే సీట్లు భర్తీ చేయాలని పేర్కొన్నారు. ముందుగా కాలేజీ స్థాయిలో స్లైండింగ్‌కు అవకాశం ఇచ్చిన తర్వాత సీట్లు భర్తీ చేయాలన్నారు. ఈనెల 15లోగా ప్రవేశాలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ అఫిలియేషన్లు వేగవంతానికి చర్యలు
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియను వేగవంతం చేసే చర్యలపై ఉన్నత విద్యా మండలి దృష్టిసారించింది. ఈ మేరకు ఆయా యూనివర్సిటీల అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ముఖ్యంగా జేఎన్‌టీయూహెచ్ నుంచే ఎక్కువ మొత్తంలో కాలేజీలకు అనుబంధ గుర్తింపు రావాల్సి ఉన్న నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి అధికారులతో సమీక్షించారు. వారం రోజుల్లో అఫిలియేషన్లు పొందిన కాలేజీల జాబితాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవి వచ్చిన వెంటనే ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించాలని భావిస్తున్నారు.
Published date : 12 Aug 2015 02:39PM

Photo Stories