Skip to main content

తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సులకు ఎంసెట్

సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీట్లను నీట్ పరీక్ష ద్వారానే భర్తీ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఇతర అగ్రికల్చర్ కోర్సులు, హార్టికల్చర్, వెటర్నరీ కోర్సులు, ఇంజనీరింగ్ కోర్సులకు మాత్రమే ఎంసెట్‌ను నిర్వహిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు.
అయితే ఎంబీబీఎస్, బీడీఎస్‌కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని, శుక్రవారం వరకు సుప్రీంకోర్టు పనిదినాలు ఉన్నం దున ఈలోగా మరేదైనా నిర్ణయం సుప్రీంకోర్టునుంచి వస్తే వాటినీ నిర్వహిస్తామన్నారు. లేదంటే ఎంబీబీఎస్, బీడీఎస్‌లను మినహాయించి మిగితా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 15న ఎంసెట్‌ను నిర్వహిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని స్పష్టం చేశారు.
Published date : 12 May 2016 05:33PM

Photo Stories