తెలంగాణలో ఎంసెట్ షెడ్యూలు జారీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ (ఎంబీబీఎస్, బీడీఎస్ మినహా) కోర్సుల్లో ప్రవేశాల కోసంఎంసెట్-2017 పరీక్షను మే 12న నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలిపారు.
ఈ మేరకు ఈనెల 11న ఎంసెట్ షెడ్యూలు జారీ చేశారు. ఈనెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని, ఆన్లైన్లోనే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు సంబంధించిన పూర్తి షెడ్యూలు, నోటిఫికేషన్‌ను ఈనెల 13న విడుదల చేయనున్నట్లు వివరించారు. తమ వెబ్సైట్లోనూ (www.eamcet.tsche.ac.in) నోటిఫికేషన్ అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. గత నెల 27న నోటిఫికేషన్ జారీ చేసి, ఈనెల 3 నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉన్నప్పటికీ సర్వీస్ ప్రొవైడర్ సమస్య కారణంగా ఆలస్యమైంది. దరఖాస్తుల తేదీలు మారాయి. పరీక్ష తేదీ మాత్రం మారలేదు. ముందు ప్రకటించినట్లుగానే మే 12న పరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 250, ఇతరులు రూ. 500 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. రెండు పరీక్షలకు హాజరవాలనుకునే విద్యార్థులు ఎస్సీ, ఎస్టీలైతే రూ. 500, ఇతరులు రూ. 1,000 చెల్లించాలి. టీఎస్ ఆన్లైన్/ఏపీ ఆన్లైన్/మీసేవా/ఈసేవా/క్రెడిట్‌కార్డు/డెబిట్‌కార్డు/నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. పరీక్షల నిర్వహణకు తెలంగాణలో 16, ఏపీలో 3 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఎంసెట్ షెడ్యూల్:
13-3-2017: నోటిఫికేషన్ విడుదల
15-3-2017 నుంచి 15-4-2017 వరకు: ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
16-4-2017 నుంచి 21-4-2017 వరకు: దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం
21-4-2017: రూ. 500 ఆలస్య రుసుముతో ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు
27-4-2017: రూ. 1,000 ఆలస్య రుసుముతో ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు
3-5-2017: రూ. 5 వేల ఆలస్య రుసుముతో ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు
1-5-2017 నుంచి 9-5-2017 వరకు: వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్ల డౌన్లోడ్
8-5-2017: రూ. 10 వేల ఆలస్య రుసుముతో ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు
12-5-2017: ఎంసెట్ రాత పరీక్ష (ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష మధాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు)

Published date : 13 Mar 2017 12:31PM