Skip to main content

తెలంగాణలో ఎంసెట్ నోటిఫికేషన్ వాయిదా

సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ నోటిఫికేషన్ జారీకి మరింత సమయం పట్టనుంది.
ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ మెడికల్ పరీక్షను నిర్వహించాలా? లేదా నీట్ ద్వారానే ప్రవేశాలు చేపట్టాలా? అన్న విషయంలో వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ఎంసెట్ దరఖాస్తులు, విద్యార్థులకు పరీక్ష కేంద్రాల కేటాయింపు, ఫలితాల వెల్లడికి సంబం ధించిన ఆన్‌లైన్, కంప్యూటర్ ప్రాసెస్‌ను చేయాల్సిన సర్వీసు ప్రొవైడర్ ఎంపిక అంశం తేలలేదు. ఈనెల 27న విద్యార్థులకు అందుబాటులో ఉంచాల్సిన నోటిఫికేషన్ జారీని ఎంసెట్ కమిటీ వాయిదా వేసింది. నోటిఫికేషన్‌పై రెండుమూడ్రోజుల్లో స్పష్టత వస్తుందని వెల్లడించింది. 2వ తేదీ మధ్యాహ్నం వరకు వీటిపై స్పష్టత వస్తేనే నోటిఫికేషన్ జారీ, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. లేదంటే దరఖాస్తుల స్వీకరణ కూడా మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి నెలకొంది. 3వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తామని కమిటీ చెబుతోంది. ఆయుష్ కోర్సుల ప్రవేశాలపై స్పష్టత ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖకు ఉన్నత విద్యా మండలి ఇటీవల లేఖ రాసింది. అయితే వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఈనెల 27 వరకు కూడా స్పష్టత రాలేదు.
Published date : 28 Feb 2017 02:56PM

Photo Stories