తెలంగాణలో ఎంసెట్-2 రద్దు !
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకైందని సీఐడీ అధికారులు నిర్ధారించిన నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేసి, ఎంసెట్-3 నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎంసెట్-2 రద్దు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని భావిస్తోంది. సీఐడీ విచారణలో 72 మంది విద్యార్థులకు ఎంసెట్-2 ప్రశ్నలు లీక్ అయినట్లు తేలింది. వీరేగాక ఇంకెంత మందికి ఆ ప్రశ్నలు చేరాయన్న సంగతి ఇంకా తేలాల్సి ఉంది. లీకేజీ ఐదారుగురు విద్యార్థులకే పరిమితమైతే వారి ర్యాంకులను తొలగించి, మిగతా విద్యార్థులకు కౌన్సెలింగ్ చేపట్టే వీలుండేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే 72 మందికి ప్రశ్నలు లీక్ అయిన నేపథ్యంలో వారందరినీ తొలగించి, మిగతా వారికి కౌన్సెలింగ్ కొనసాగించడం అసాధ్యమని అంటున్నారు. విచారణ పూర్తయితే తప్ప ప్రశ్నలు ఇంకా ఎందరికి లీక్ అయ్యాయన్న అంశంపై కచ్చితమైన నిర్ణయానికి వచ్చే పరిస్థితి ఉండదు. పైగా ఈ వ్యవహారంలో నిందితులపై కేసులు నమోదు చే సి కోర్టులో హాజరు పరచాల్సి ఉంది. అలాంటపుడు లీక్ అయినఅయిన ప్రశ్నలతో ర్యాంకులు పొందిన విద్యార్థుల పేర్లను తొలగించి, కౌన్సెలింగ్ నిర్వహించడం సాధ్యం కాదని, ఎంసెట్-3 పరీక్షను నిర్వహించాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇదే అంశంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం అధికారులతో సమీక్షించారు. సీఐడీ పేర్కొన్న అంశాలపై చర్చించారు. ఎంసెట్-2ను రద్దు చేయడమే సరైందన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై గురువారం అధికారికంగా నిర్ణయం తీసుకొని ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది.
45 రోజుల్లో ఎంసెట్-3
ఎంసెట్-2 పరీక్షను రద్దు చేస్తే ఎంసెట్-3 పరీక్ష నిర్వహణకు కనీసం 45 రోజుల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఎంసెట్-2 రద్దు, ఎంసెట్-3 నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయం తర్వాతే తదుపరి చర్యలు చేపడతామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. పరీక్ష నిర్వహించాల్సి వస్తే మాత్రం సెప్టెంబర్ 20 నాటికి నిర్వహించే వీలుంటుందని, ఈలోగా మళ్లీ కన్వీనర్ నియామకం, ప్రశ్నపత్రాల రూపకల్పన, వాటి ముద్రణ, విద్యార్థులకు హాల్‌టికెట్ల జారీ తదితర పనులన్నీ చేపట్టాల్సి ఉంటుంది. ఎంసెట్-3 కోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల ప్రక్రియ వంటివేవీ లేకుండానే.. ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికి హాల్‌టికెట్లు జారీచేసి, పరీక్షను నిర్వహించనున్నారు.
జేఎన్‌టీయూ వీసీకి బాధ్యతలు
ప్రస్తుత వివాదం నేపథ్యంలో ఇప్పటివరకు ఎంసెట్‌కు కన్వీనర్‌గా వ్యవహ రించిన రమణరావుకు కాకుండా జేఎన్‌టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డికి ఎంసెట్-3 బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ 30 నాటికి మెడికల్ ప్రవేశాల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుత లీకేజీ సమస్య నేపథ్యంలో మరికొంత సమయం ఇవ్వాలని ఎంసీఐకి విజ్ఞప్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు సీఐడీ విచారణలో జేఎన్‌టీయూహెచ్‌కు చెందిన ఓ ప్రొఫెసర్, సిబ్బంది పాత్రపైనా అనుమానాలు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో జేఎన్‌టీయూహెచ్ వీసీ వేణుగోపాల్‌రెడ్డి అధికారులతో సమావేశ మై విచారణ జరిపినట్లు తెలిసింది. మరోవైపు తల్లిదండ్రులు మాత్రం ఎంసెట్-2ను రద్దు చేయవద్దని, నిందితుల పేర్లను, ర్యాంకులను తొలగించి, మిగతా వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి విజ్ఞప్తి చేశారు.
పూర్తిస్థాయి నివేదిక వచ్చాకే నిర్ణయం: లక్ష్మారెడ్డి
ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై సీఐడీ నివేదిక పూర్తిస్థాయిలో వచ్చాకే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టంచేశారు. విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు. సీఐడీ నివేదిక గురువారం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 30 లోగా పూర్తి కావాల్సి ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఏపీ మెడికల్ వెబ్ ఆప్షన్లకు బ్రేక్:
తెలంగాణ మెడికల్ పరీక్ష ప్రశ్నా పత్రం లీక్ అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌పడింది. వాస్తవానికి ఈ నెల 29, 30 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నిర్వహించి 31వ తేదీలోగా సీట్లు కేటాయించి.. ఆగస్టు 1వ తేదీ నుంచి తరగతులు నిర్వహించాల్సి ఉంది. అయితే తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో ఏపీ మెడికల్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు వాయిదా వేశారు. స్థానికేతర కోటా విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశమున్న దృష్ట్యా వారీ నిర్ణయం తీసుకున్నారు.
ఆ ఇబ్బంది రాకూడదనే..:
రాష్ట్రం విడిపోయినప్పటికీ.. విభజన చట్టం ప్రకారం నాన్‌లోకల్ అన్‌రిజర్వుడు (15 శాతం) మెరిట్ సీట్లకోసం తెలంగాణకు చెందిన విద్యార్థులు ఏపీలో పోటీపడవచ్చు. అలాగే ఏపీ అభ్యర్థులు తెలంగాణలో పోటీపడవచ్చు. అయితే లీకేజీ నేపథ్యంలో తెలంగాణ ఎంసెట్-2ను రద్దు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఫలితంగా తెలంగాణలో మళ్లీ పరీక్ష నిర్వహించి.. ఫలితాలు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియంతటినీ యుద్ధప్రాతిపదికన నిర్వహించడానికైనా ఎంత కాదన్నా 20 రోజులకు తక్కువ కాదని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మెడికల్ కౌన్సెలింగ్‌లో వెబ్‌ఆప్షన్ల ప్రక్రియను నిర్వహిస్తే.. సాధారణంగా తెలంగాణ అభ్యర్థులు అన్‌రిజర్వుడు సీట్లకు ఆప్షన్లు పెట్టి బ్లాక్ చేస్తారు. తరువాత కొన్నిరోజులకు తెలంగాణ మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తే అన్‌రిజర్వుడు కింద ఆప్షన్లు పెట్టుకున్న ఈ అభ్యర్థులు తెలంగాణలో లోకల్(85శాతం) కోటా కింద ఉస్మానియా, గాంధీ, కాకతీయ వంటి మెడికల్ కళాశాలల్లో సీట్లు పొందేందుకు మొగ్గుచూపుతారు. ఈ క్రమంలో ఏపీలో తెలంగాణ అభ్యర్థులు సీట్లు బ్లాక్ చేయడంవల్ల గందరగోళ పరిస్థితి ఎదురవుతుందని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు ఆలోచనలో పడ్డారు. దీంతో కొద్దిరోజులపాటు వేచిచూడాలనే అభిప్రాయానికి వారు వచ్చారు. తెలంగాణ ఎంసెట్-2పై స్పష్టత వచ్చాకే ఏపీ మెడికల్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియపై వారు నిర్ణయం తీసుకునే వీలుంది.

Published date : 28 Jul 2016 11:56AM