Skip to main content

తెలంగాణలో 15 నుంచి ఎంసెట్ ఫార్మా కౌన్సెలింగ్

సాక్షి, హైదరాబాద్: బీ-ఫార్మసీ, ఫార్మ్-డి, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 15వ తేదీ నుంచి ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల క్యాంపు కన్వీనర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆదివారం జారీ చేశారు.
విద్యార్థులు ఈనెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని, 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని చెప్పారు. 18న అన్ని ర్యాంకుల వారు వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చని, 20న సీట్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. సీట్ల కేటాయింపు వివరాలను www.tseamcetb.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 173 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో బీఫార్మసీలో 2,060 సీట్లు, ఫార్మ్-డిలో 330, బయో టెక్నాలజీలో 42 సీట్లు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం 13 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, ఆధార్ కార్డు, టెన్త్ మెమో, ఇంటర్మీడియెట్ మెమో, టీసీ, ఆరో తరగతి నుంచి స్టడీ సర్టిఫికెట్లు, 2016 జనవరి 1 తరువాత జారీ చేసిన ఆదాయం సర్టిఫికెట్, కులం, నివాస ధ్రువీకరణ పత్రం, ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ వెంట తెచ్చుకోవాలని పేర్కొన్నారు. స్పెషల్ కేటగిరీ వారికి సాంకేతిక విద్యా భవన్‌లో వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. మిగతా ర్యాంకుల వారికి హెల్ప్‌లైన్ కేంద్రాల్లో వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, కొత్తగూడెం (రుద్రంపూర్), వరంగల్, బెల్లంపల్లి, నిజామాబాద్‌ల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు, ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డి గ్రీ కాలేజీ, వరంగల్‌లోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ మహిళా పాలిటెక్నిక్, సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లిలోని గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాలజీ, చందూలాల్ బారాదరిలోని క్యూ క్యూ ప్రభుత్వ పాలిటెక్నిక్, రామంతాపూర్‌లోని జేఎన్ ప్రభుత్వ పాలిటెక్నిక్, సాంకేతిక విద్యా భవన్‌లో హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

వెరిఫికేషన్ షెడ్యూలు :
తేదీ ర్యాంకు పరిధి
15-7-16 1 నుంచి 25 వేలు
16-7-16 25,001 నుంచి 50 వేలు
17-7-16 50,001 నుంచి చివరి ర్యాంకు వరకు

వెబ్ ఆప్షన్ల షెడ్యూలు :
తేదీలు ర్యాంకు పరిధి
జూలై 15,16 1 నుంచి 25 వేలు
16, 17 25,001 నుంచి 50 వేలు
17, 18 50,001 నుంచి చివరి వరకు
18 అన్ని ర్యాంకుల వారికి ఆప్షన్లలో మార్పులకు అవకాశం
20 కేటాయింపులు ప్రకటన
Published date : 11 Jul 2016 03:19PM

Photo Stories