Skip to main content

తెలంగాణలో 12 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 12 నుంచి టీఎస్ ఎంసెట్-2017 కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎంసెట్ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఈనెల 3న ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశంలో ఈ మేరకు ప్రవేశాల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. జేఎన్‌టీయూహెచ్ అధికారులు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల అనుబంధ గుర్తింపును ఈ నెల 10లోగా ఇస్తామని పేర్కొనడంతో షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ నెల 12 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 16 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు. వెరిఫికేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 21 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమావేశంలో సాంకేతిక విద్య కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ వాణిప్రసాద్, క్యాంపు ఆఫీసర్ శ్రీనివాస్, జేఎన్‌టీయూహెచ్ అధికారులు పాల్గొన్నారు.
ఆధార్, బయోమెట్రిక్ తప్పనిసరి..
ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు ఈసారి ఆధార్, బయోమెట్రిక్‌ను తప్పనిసరి చేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్‌ఎస్‌సీ మార్కుల మెమో, ఇంటర్ మెమో-పాస్ సర్టిఫికెట్, ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఈ ఏడాది జనవరి 1, ఆ తరువాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, వికలాంగులు, స్పెషల్ కేటగిరీవారు ఆయా సర్టిఫికెట్లు, నాన్ లోకల్ వారైతే వారి తల్లిదండ్రులు తెలంగాణలో గతంలో పదేళ్లపాటు నివసించినట్లు ఉన్న ధ్రువీకరణ పత్రం, రెగ్యులర్ స్టడీ లేనివారు ఏడేళ్లపాటు ఇక్కడ నివసించి ఉన్నట్లు నివాస ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌కు సంబంధించిన వారు, ఎన్‌సీసీ, స్పోర్‌‌ట్స, వికలాంగులు వంటి స్పెషల్ కేటగిరీకి చెందిన వారికి మాసబ్ ట్యాంకు సాంకేతిక విద్యా భవన్‌లోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది.

ఇదీ ప్రవేశాల షెడ్యూల్...
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ : జూన్ 12 నుంచి 21 వరకు
వెబ్ ఆప్షన్లు : జూన్ 16 నుంచి 22 వరకు
ఆప్షన్లలో మార్పులు : జూన్ 22 నుంచి 23 వరకు
మొదటి దశ సీట్ల కేటాయింపు : జూన్ 28న
కాలేజీల్లో చేరడం : జూలై 3వ తేదీలోగా..

ర్యాంకులవారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలు..
తేదీ ర్యాంకు
12-6-2017 1 నుంచి 6 వేలు
13-6-2017 6,001 నుంచి 16 వేలు
14-6-2017 16,001 నుంచి 26 వేలు
15-6-2017 26,001 నుంచి 36 వేలు
16-6-2017 36,001 నుంచి 46 వేలు
17-6-2017 46,001 నుంచి 56 వేలు
18-6-2017 56,001 నుంచి 68 వేలు
19-6-2017 68,001 నుంచి 80 వేలు
20-6-2017 80,001 నుంచి 92 వేలు
21-6-2017 92,001 నుంచి చివరి ర్యాంకు వరకు.

ర్యాంకులవారీగా వెబ్ ఆప్షన్ తేదీలు..
తేదీలు ర్యాంకు
16-6-2017, 17-6-2017 1 నుంచి 36 వేలు
18-6-2017, 19-6-2017 36001 నుంచి 56 వేలు
20-6-2017, 21-6-2017 56001 నుంచి 80 వేలు
21-6-2017, 22-6-2017 80001 నుంచి చివరి ర్యాంకు వరకు
22-6-2017, 23-6-2017 వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం
28-6-2017 సీట్లు కేటాయింపు, వెబ్‌సైట్‌లో వివరాలు.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ హెల్ప్‌లైన్ కేంద్రాలు..

ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం 21 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ వివరాలు..
  • హైదరాబాద్‌లో: జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామంతాపూర్, గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాలజీ, ఈస్ట్ మారేడ్‌పల్లి, క్యూ క్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ (జూపార్కు ఎదురుగా), సాంకేతిక విద్యా భవన్, మాసబ్ ట్యాంక్, జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూకట్‌పల్లి
  • ఎస్‌ఆర్‌ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, కరీంనగర్
  • డాక్టర్ బీఆర్ ఆంబేడ్కర్ జీఎంఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ వుమెన్, కరీంనగర్
  • ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, ఖమ్మం
  • వనపర్తి, మహబూబ్‌నగర్, బెల్లంపల్లి (ఆదిలాబాద్), కొత్తగూడెం, రాజగోపాల్‌పేట్ (సిద్దిపేట), నల్లగొండ, వరంగల్, నిజమాబాద్, మెదక్ (వుమెన్) గవర్నమెంట్ పాలిటెక్నిక్‌లలో.
  • నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నల్లగొండ.
  • గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పీజీ బ్లాక్, నిజమాబాద్
  • యూనివర్సిటీ ఆర్‌‌ట్స అండ్ సైన్స్‌ కాలేజీ, సుబేదారి హన్మకొండ.
  • కాకతీయ యూనివర్సిటీ వరంగల్.
Published date : 05 Jun 2017 03:15PM

Photo Stories