తెలంగాణ విద్యార్థులకు మరో అవకాశం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2ను రద్దు చేసిన నేపథ్యంలో ఏపీ ఎంసెట్‌లోనూ మంచి ర్యాంకులు సాధించిన రాష్ట్ర విద్యార్థులు అక్కడ సీట్లు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్య చేపట్టింది. ఏపీలో వైద్య సీట్ల భర్తీకి అక్కడి ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను మరోసారి నిర్వహించాలని కోరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి శనివారం ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు ఫోన్లో విజ్ఞప్తి చేశారు. లక్ష్మారెడ్డి విన్నపానికి అంగీకరించిన కామినేని...తెలంగాణ విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఒక రోజు అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి... ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ రవిరాజుకు ఈ అంశంపై లేఖ రాశారు. ఏపీలో మెడికల్ సీట్ల కౌన్సెలింగ్ వచ్చే నెల 6, 7, 8 తేదీల్లో జరగనుంది. ఆలోగా తెలంగాణ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒకరోజు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించాల్సి ఉంటుంది.
ఇక్కడ వస్తుందనుకుకొని...: ఎంసెట్-2లో చాలా మంది టాపర్లు ఏపీ ఎంసెట్‌లోనూ టాప్ ర్యాంకులు పొందారు. అయితే తెలంగాణ ఎంసెట్-2లో మంచి ర్యాంకులు వచ్చినందున ఏపీలో సీట్లను వదులుకున్నారు. అందుకే ఏపీ సర్కారు ఇటీవల నిర్వహించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కు చాలామంది తెలంగాణ విద్యార్థులు హాజరుకాలేదు. అయితే ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం బయటపడింది. ఏపీలో సీటును వదులుకోవడంతో 2చోట్లా ఆయా విద్యార్థులు నష్టపోయారు. అయితే ఏపీలో ఇంకా కౌన్సెలింగ్ ప్రక్రియ ముగియలేదు. ఈ నేపథ్యంలో వెరిఫికేషన్‌లో పాల్గొనని కొందరు విద్యార్థులు మంత్రి లక్ష్మారెడ్డి, వీసీ కరుణాకర్‌రెడ్డిలను కలసి గోడువెళ్లబోసుకున్నారు. దీంతో ఈ అంశంపై ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది.
15 శాతం సీట్లలో ఓపెన్ కాంపిటీషన్...:
ఏపీ మెడికల్ సీట్లలో మొదటి 15% సీట్లలో తెలంగాణ విద్యార్థులు ఓపెన్ కాంపిటీషన్‌లో సీట్లు పొందడానికి వీలుంది. ఆ ప్రకారం తెలంగాణకు చెందిన అనేక మంది టాప్ ర్యాంకర్లు ఏపీలో సీట్లు పొందొచ్చు. ఎన్టీఆర్ ఆరో గ్య విశ్వవిద్యాలయం అధికారులు మాత్రం దీనివల్ల తమ విద్యార్థుల సీట్లకు కోత పడతాయన్న ఆందోళనలో ఉన్న ట్లు తెలిసింది. ఈ విషయంలో మానవ తా ధృక్పథంతో ఆలోచించాలని తెలంగాణ ప్రభుత్వం ఏపీని కోరుతోంది.

Published date : 01 Aug 2016 04:01PM