తెలంగాణ ప్రైవేటు ఎం-సెట్ కౌన్సెలింగ్‌పై అస్పష్టత
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రైవేటు వైద్య, దంత కళాశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎం-సెట్)లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహించాలో మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ఇప్పటికీ నిర్ణయించలేదు.
ర్యాంకులు ప్రకటించి రోజులు గడుస్తున్నా... ప్రభుత్వ సీట్లకు కౌన్సెలింగ్ పూర్తవుతున్నా కౌన్సిలింగ్ తేదీలను ఖరారు చేయడంలో యాజమాన్యాలు నిర్లక్ష్యం చూపుతున్నాయన్న విమర్శలున్నాయి. కౌన్సెలింగ్ తేదీల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ప్రైవేటు వైద్య కాలేజీల్లోని 35 శాతం యాజమాన్య సీట్లకు ప్రత్యేక ఎం-సెట్ జరిగిన విషయం విదితమే. మొదటిసారి జరిగిన ఈ పరీక్షకు 5,130 మంది హాజరైతే... 2,266 మంది ర్యాంకులు ప్రకటించారు. మొదటి నుంచీ గోప్యత పాటిస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు ర్యాంకుల ప్రకటనలోనూ అదే రీతిలో వ్యవహరించాయి. ఇప్పుడు కౌన్సెలింగ్ తేదీలపైనా దోబూచులాట కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు సీట్లకు కౌన్సెలింగ్ ఈ నెల 12న ప్రారంభం కానుంది. కానీ మన రాష్ట్రానికి చెందిన ప్రైవేటు కౌన్సెలింగ్ తేదీలపై స్పష్టత రాలేదు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాత్రం తేదీలను ఖరారు చేసేందుకు సన్నద్ధత వ్యక్తంచేసినా ఇక్కడి యాజమాన్యాలు మాత్రం నోరుమెదపడంలేదని తెలిసింది. రాష్ట్రం లో ఎక్కడెక్కడ కౌన్సెలింగ్ నిర్వహిస్తారోనన్న విషయంలోనూ అస్పష్టతే. వివిధ రాష్ట్రాల్లో వైద్య సీట్లకు ప్రయత్నాలు చేస్తున్న విద్యార్థులు ఇక్కడ ప్రైవేటు సీట్లకు కౌన్సెలింగ్ ఖరారైతే అందుకనుగుణంగా ప్రయత్నాలు చేసుకోవచ్చని భావిస్తున్నారు.

Published date : 06 Aug 2015 02:49PM