Skip to main content

తెలంగాణ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. మే 18 వరకే దరఖాస్తుకు అవకాశం..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ను ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ గురువారం విడుదల చేసింది.
విద్యార్థులు ఈనెల 20వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. గతంలో మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని షెడ్యూల్‌ ప్రకటించినా అందులో మార్పులు చేసింది. ఇక విద్యార్థులు మే 19–27వ తేదీ వరకు తమ ఆన్‌లైన్‌ దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకోవచ్చని తెలిపింది. జూన్‌ 17 నుంచి జూలై 1వ తేదీ వరకు హాల్‌టికెట్లు డౌలోడ్‌ చేసుకోవాలని సూచించింది.

Must check:
EAMCET free practice tests

EAMCET online grand tests

EAMCET study material 

అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ పరీక్షను జూలై 5, 6 తేదీల్లో, ఇంజనీరింగ్‌ పరీక్షను జూలై 7, 8, 9 తేదీ ల్లో నిర్వహించనుంది. ఈసారి ఇంగ్లిష్‌ భాషలోనే ఒక పేపర్‌ను ప్రత్యేకంగా ఇస్తున్నందున విద్యార్థు లు దరఖాస్తు చేసేటప్పుడే ఆప్షన్‌ ఇచ్చుకోవాలని స్పష్టం చేసింది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ నుంచి 100% సిలబస్‌కు 55 శాతం ప్రశ్నలు అంటే.. 88 ప్రశ్నలు, సెకండ్‌ ఇయర్‌ నుంచి 70 శాతం సిలబస్‌కు 45 శాతం ప్రశ్నలు అంటే.. 72 ప్రశ్నలు ఇస్తార ని, ఇలా మొత్తంగా 160 ప్రశ్నలుంటాయని వెల్లడించింది.
Published date : 19 Mar 2021 04:06PM

Photo Stories