తెలంగాణ ఎంసెట్ దరఖాస్తులకు 28న ఆఖరు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ దరఖాస్తుల గడువు సోమవారంతో ముగియనుంది.
ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆదివారం రాత్రి 8 గంటల వరకు 2,17,195 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోసం 90,001 మంది, ఇంజనీరింగ్ కోసం 1,25,390 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ కోసం అత్యధికంగా బాలురు (77,479 మంది) దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్ మెడికల్ కోసం ఎక్కువ మంది బాలికలు (58,535 మంది) దరఖాస్తు చేసుకున్నారు.
Published date : 28 Mar 2016 02:49PM