Skip to main content

తెలంగాణ ఎంసెట్ - 2 ర్యాంకులు విడుద‌ల‌

సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణలో ఈ నెల 9న నిర్వహించిన ఎంసెట్-2 ఫ‌లితాల‌ను వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం సాయంత్రం సచివాలయంలో విడుదల చేశారు.
ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ఖరారు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 56,153 మంది విద్యార్థులు దరఖాస్తుచేసుకోగా 50,961 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 47,644 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన‌ట్లు మంత్రి వెల్లడించారు.
మొద‌టి ప‌ది ర్యాంకులు సాధించిన విద్యార్థులు..
మొద‌టి ర్యాంకు - ఉజ్వల్, 97.66 శాతం మార్కులు (హైదరాబాద్)
రెండో ర్యాంకు - ఐశ్వర్య, 97.66 శాతం మార్కులు (మెదక్)
మూడో ర్యాంకు - సాయి సుశృత, 97.61 శాతం మార్కులు (కర్నూలు)
నాలుగో ర్యాంకు - వేణు మాధవ్, 97.53 శాతం మార్కులు (హైదరాబాద్)
ఐదో ర్యాంకు - అంకిత్ రెడ్డి, 97.36 శాతం మార్కులు (హైదరాబాద్)
ఆరో ర్యాంకు - ప్రణవి, 97.19 శాతం మార్కులు (మహబూబ్‌నగర్)
ఏడో ర్యాంకు - తేజస్విని, 97.19 శాతం మార్కులు (అనంతపురం)
ఎనిమిదో ర్యాంకు - సిద్ధార్థ్ రావు, 97.02 శాతం మార్కులు (హైదరాబాద్)
తొమ్మిదో ర్యాంకు - వినీత్ రెడ్డి, 96.98 శాతం మార్కులు (హైదరాబాద్)
పదో ర్యాంకు - కృష్ణగీత్, 96.90 శాతం మార్కులు (ఖమ్మం)
Published date : 13 Jul 2016 12:00PM

Photo Stories