Skip to main content

సాక్షి మాక్ ఎంసెట్ ఫలితాలు విడుదల

సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పరీక్షకు సమర్థవంతంగా సిద్ధమయ్యేందుకు వీలుగా విద్యార్థుల్లో అవగాహన, విజయంపై ధీమా కల్పించేందుకు ‘సాక్షి’ నిర్వహించిన మాక్ ఎంసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.
ఈ ఫలితాల్లో ఏపీ ఇంజనీరింగ్ విభాగంలో విశాఖపట్నానికి చెందిన జి.చైతన్య, మెడికల్ విభాగంలో గుంటూరుకు చెందిన కె.అఖిల గాయత్రి... తెలంగాణ ఇంజనీరింగ్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన ఎం.కొండ తరుణ్‌సాయి, మెడికల్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన ఈ.సాత్విక్‌రెడ్డి టాపర్లుగా నిలిచారు. ఈ మాక్ ఎంసెట్‌కు హాజరైన విద్యార్థులంతా www.sakshieducation.com వెబ్‌సైట్లో ఫలితాలను చూసుకోవచ్చు.

Published date : 25 Apr 2016 02:18PM

Photo Stories