‘సాక్షి మాక్ ఎంసెట్’ ఫలితాలు విడుదల
Sakshi Education
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 16న నిర్వహించిన ‘సాక్షి మాక్ ఎంసెట్’ ఫలితాలు విడుదలయ్యాయి.
వైజాగ్‌లోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీకి చెందిన సంచన పాపానాయుడు 153 మార్కులతో మొదటి ర్యాంకు సాధించాడు. అదే కాలేజీకి చెందిన సింహాద్రి శ్రీనివాస్(152) రెండో ర్యాంకు సాధించగా, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఆదిత్య జూనియర్ కాలేజీకి చెందిన గంపల సాయి ధీరజ్(141) మూడో ర్యాంకు, అదే కాలేజీకి చెందిన నానిశెట్టి ధరణి శ్రేయన్(139) నాలుగో ర్యాంకు, గుంటూరులోని శ్రీచైతన్య కాలేజీకి చెందిన పి.రూప్ సాయి రాకేశ్ గుప్తా(117) ఐదో ర్యాంకు సాధించారు. వీరికి త్వరలో బహుమతులు అందజేయనున్నారు. ఫలితాలు www.sakshieducation.com లో అందుబాటులో ఉన్నాయి.
ఫలితాల కోసం క్లిక్ చేయండి.
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఫలితాల కోసం క్లిక్ చేయండి.
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Published date : 01 May 2017 02:10PM