Skip to main content

రేపట్నుంచి టీస్ ఎంసెట్– 2021 అగ్రికల్చర్ ఎంట్రన్స్ టెస్ట్స్..

సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ శుక్రవారంతో ముగిసింది. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఆరు సెషన్లలో జరిగిన ఈ పరీక్షకు 1,47,986 మంది (89.71 శాతం) విద్యార్థులు హాజరైనట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్దన్ తెలిపారు.
ఈసారి సెకండియర్‌ సిలబస్‌ను ప్రభుత్వం తగ్గించినందున ఆ మేరకు ఎంసెట్‌లో సెకండియర్‌ ప్రశ్నలు తగ్గాయి. ఈసారి ఇంటర్‌ ఫస్టియర్‌ నుంచే దాదాపు 55 శాతం ప్రశ్నలు వచ్చినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ఈసారి ఎక్కువ మార్కులు 140–145 మధ్యన ఉండే అవకాశముందని శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీ డీన్‌ శంకర్‌రావు అభిప్రాయపడ్డారు. సుమారు వంద మార్కులు సాధించే వారికి టాప్‌–10 కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉందని, 80 మార్కులకుపైగా వస్తే 10 వేలలోపు ర్యాంకుతో మంచి కాలేజీల్లో సీట్లు రావొచ్చని ఆయన విశ్లేíÙంచారు. ఇంటర్‌ సెకండియర్‌ తరగతులను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించడం, ఎంసెట్‌ కోచింగ్‌ సైతం ఆన్‌లైన్‌లోనే సాగడంతో విద్యార్థులు ఈసారి సమగ్రంగా చదవలేకపోయారన్నారు. అందువల్ల టాప్‌ విద్యార్థులు తప్ప మిగిలిన విద్యార్థులకు మార్కులు అంతగా రాకపోవచ్చన్నారు. మరోవైపు ఈ నెల 9, 10వ తేదీల్లో మెడికల్, అగ్రికల్చర్‌ కోర్సులకు సంబంధించి పరీక్ష జరగనుంది.

చ‌ద‌వండి: తెలంగాణ పాలిసెట్‌ – 2021 స్లాట్‌ బుకింగ్‌కు చివరి తేదీ ఆగస్టు 9
Published date : 07 Aug 2021 03:34PM

Photo Stories