రేపటి నుంచి ఏపీ ఎంసెట్ మెడికల్ కౌన్సెలింగ్
Sakshi Education
విజయవాడ(హెల్త్ వర్సిటీ): ఏపీలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో బి-కేటగిరీ సీట్ల భర్తీకి ఈ నెల 12, 13 తేదీల్లో విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
కౌన్సెలింగ్ ఉదయం 8 గంటలకే ప్రారంభమవుతుంది. ఈ మేరకు వర్సిటీ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 12న 1 నుంచి 1,000 ర్యాంకు వరకు, 13న 1,001 నుంచి చివరి ర్యాంకు వరకు కౌన్సెలింగ్ జరగనుంది. కౌన్సెలింగ్ కేం ద్రంలో ఏర్పాటు చేసిన బ్యాంకు కౌంటర్‌లో రూ.5 వేలు చెల్లించి హాజరు కావాలి. అభ్యర్థులు ధ్రువపత్రాలను తీసుకురావాల్సి ఉంటుంది. మొత్తం 11 మెడికల్, 12 డెంటల్ కళాశాల్లోని బి-కేటగిరీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. వర్సిటీ ఫీజు ఎంబీబీఎస్‌కు రూ.25 వేలు, బీడీఎస్‌కు రూ.16 వేలు చెల్లించాలి. ట్యూషన్ ఫీజు ఎంబీబీఎస్‌కు రూ.11 లక్షలు, బీడీఎస్ రూ.4.50 లక్షలు చెల్లించాలి.
Published date : 11 Aug 2015 01:48PM