Skip to main content

ప్రశాంతంగా ఏపీ ఎంసెట్‌.. సెప్టెంబర్‌ 23, 25 తేదీల్లో అగ్రి, ఫార్మసీ కోర్సులకు ప్రవేశ పరీక్షలు

సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, బీఫార్మసీ తదితర సాంకేతిక వృత్తి విద్యాకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఎంసెట్‌–2020 పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్‌ సహా ఏపీలోని 47 నగరాలు, పట్టణాల్లోని 93 కేంద్రాల్లో కంప్యూటర్‌ ఆధారితంగా ఈ పరీక్షను నిర్వహించారు. తొలిరోజు ఈ పరీక్షలకు 84.43% మంది హాజరయ్యారు. మొదటి రోజు రెండు సెషన్లకు కలిపి 41,444 మంది దరఖాస్తు చేయగా వారిలో 34,994 మంది హాజరయ్యారు. ఈ నెల 23 వరకు ఇంజనీరింగ్, 23 నుంచి 25 వరకు అగ్రి, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు జరగనున్నాయి.

Check EAMCET Agriculture quick review and bit banks   
  • ఏపీ ఎంసెట్‌కు మొత్తం 2,72,900 మంది దరఖాస్తు చేశారు. అందులో ఇంజనీరింగ్‌ పరీక్షకు 1,85,263 మంది, అగ్రి తదితర కోర్సుల ప్రవేశ పరీక్షకు 87,637మంది ఉన్నారు.
  • కోవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం అభ్యర్థులను భౌతిక దూరాన్ని పాటింపచేస్తూ థర్మల్‌ గన్‌లతో టెంపరేచర్‌ను పరీక్షించి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఇందుకోసం ప్రత్యేక వలంటీర్లను ఏర్పాటు చేశారు. టెంపరేచర్‌ సాధారణం కంటే ఎక్కువగా ఉన్న వారికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. ప్రతి అభ్యర్థి నుంచి సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తీసుకున్నారు.
  • అభ్యర్థులందరూ మాస్కులు ధరించేలా చూడటంతోపాటు శానిటైజర్లను, చేతులు శుభ్రం చేసుకొనేందుకు అనువుగా ఏర్పాట్లు చేశారు.
  • ఎంసెట్‌ పరీక్షలకు తొలిరోజు కృష్ణా జిల్లాలో అత్యధిక శాతం మంది హాజరయ్యారు. 5,396 మందికి గాను 4,496 మంది హాజరయ్యారు. తరువాత స్థానంలో గుంటూరు కాగా తక్కువ సంఖ్యలో పరీక్ష రాసిన వారిలో విజయనగరం (1,319 మందికి గాను 1,154) చివరిస్థానంలో ఉంది. అన్ని జిల్లాల్లోనూ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్టు ఉన్నత విద్యామండలి ప్రత్యేకాధికారి (ఏపీసెట్స్‌) డాక్టర్‌ ఎం.సుధీర్‌రెడ్డి తెలిపారు.
జిల్లాల వారీ వివరాలు ఇలా

జిల్లా

సెంటర్లు

దరఖాస్తు

హాజరు

అనంతపురం

7

2,232

1,975

చిత్తూరు

6

3,650

3,188

తూ.గో.

9

4,069

3,589

గుంటూరు

13

4,358

3,877

కడప

7

2,343

2,109

కృష్ణా

10

5,396

4,496

కర్నూలు

2

2,066

1,757

నెల్లూరు

7

2,507

2,223

ప్రకాశం

8

2,911

2,578

శ్రీకాకుళం

4

1,564

1,381

విశాఖపట్నం

7

3,553

3,065

విజయనగరం

3

1,319

1,154

ప.గో.

8

2,531

2,282

హైదరాబాద్‌

2

2,945

1,320

మొత్తం

93

41,444

34,994

Published date : 18 Sep 2020 03:15PM

Photo Stories