Skip to main content

ప్రభుత్వ విద్యార్థులకు ఉచిత ఎంసెట్ శిక్షణ

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియెట్ పూర్తి చేసి, ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఎంసెట్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఇంటర్ విద్య కమిషనర్ డాక్టర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ ఈ నెల 1 నుంచి 30 వరకు ఉంటుందని పేర్కొన్నారు.
ఆసక్తి కలిగిన విద్యార్థులు 7లోగా తమ వెబ్‌సైట్‌లో (www.bietelangana.cgg.gov.in) పేర్లు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

శిక్షణ ఎక్కడెక్కడంటే..:
వరంగల్, ఖమ్మం:
తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ (టీఎస్‌ఎంఎస్) గవిచర్ల(బాలికలకు), టీఎస్‌ఎంఎస్ వంచనగిరి (బాలురు).
కరీంనగర్, ఆదిలాబాద్: టీఎస్‌ఎంఎస్ న్యాలం, కొండపల్లి, గంగాధర (బాలికలు), టీఎస్‌ఎంఎస్ బోయిన్‌పల్లి (బాలురు).
మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్: టీఎస్‌ఎంఎస్ బొంగుళూరు, ఇబ్రహీంపట్నం (బాలికలకు). టీఎస్‌ఎంఎస్ పాలమాకుల, శంషాబాద్ (బాలురకు).
నల్లగొండ: టీఎస్‌ఎంఎస్ చౌటుప్పల్ (బాలికలకు), టీఎస్‌ఎంఎస్ మిర్యాలగూడ (బాలురకు).
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎయిడెడ్ జూనియర్ కాలేజ్ (కో ఎడ్యుకేషన్), బాగ్‌లింగంపల్లి (నాన్ రెసిడెన్షియల్).
Published date : 01 Apr 2016 01:33PM

Photo Stories