Skip to main content

నేటి నుంచి ఏపీ ఎంసెట్- 2020 దరఖాస్తుల స్వీకరణ!

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఎంసెట్-2020 దరఖాస్తులను ఫిబ్రవరి 29 (శనివారం)నుంచి స్వీకరిస్తున్నట్టు కన్వీనర్ డాక్టర్ విప్పర్తి రవీంద్ర చెప్పారు.
ఆయన ఫిబ్రవరి 28 (శుక్రవారం)నమీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి బీటెక్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీవీఎస్‌సీ, ఏహెచ్, బీఎఫ్‌ఎస్‌సీ, బీ-ఫార్మసీ, ఫార్మాడీ కోర్సుల ప్రవేశానికి కాకినాడ జేఎన్‌టీయూ వరుసగా ఆరోసారి ఎంసెట్ నిర్వహిస్తోందని పేర్కొన్నారు. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో నాలుగోసారి ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఎంసెట్ స్టడీ మెటీరియల్, ఆన్‌లైన్ మోడల్ టెస్ట్స్, గెడైన్స్, ఇతర ఇప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి.

ప్రవేశ పరీక్ష కేంద్రాలు
శ్రీకాకుళం, రాజాం, టెక్కలి, విజయనగరం, బొబ్బిలి, విశాఖపట్నం సిటీ, ఆనందపురం, గాజువాక, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, విజయవాడ, మచిలీపట్నం, మైలవరం, కంచికచర్ల, గుడ్లవల్లేరు, గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు, మార్కాపురం, చీరాల, నెల్లూరు, కావలి, గూడూరు, చిత్తూరు, పుత్తూరు, తిరుపతి, మదనపల్లి, కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, అనంతపురం, పుట్టపర్తి, గుత్తి, హిందూపురం, కర్నూలు, నంద్యాలతో పాటు హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్, నాచారం, సికింద్రాబాద్. ఈ ఏడాది కొత్తగా ప్రకాశం జిల్లా చీమకుర్తి, కృష్ణా జిల్లా తిరువూరు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అదనంగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు డాక్టర్ రవీంద్ర చెప్పారు.
  • దరఖాస్తులకు గడువు మార్చి 29. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 5 వరకు, రూ.1000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 10 వరకు, రూ.5 వేల అపరాధ రుసుంతో ఏప్రిల్ 15 వరకు, రూ.10 వేల అపరాధ రుసుంతో ఏప్రిల్ 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
  • పరీక్ష ఫీజును http://sche.ap.gov.in/emcet వెబ్‌సైట్ ద్వారా చెల్లించాలి.
  • ఏప్రిల్ 16 నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ఇంజినీరింగ్ పరీక్షలు ఏప్రిల్ 20, 21, 22, 23 తేదీల్లో, అగ్రికల్చర్ పరీక్షలు ఏప్రిల్ 23, 24 తేదీల్లో ఉంటాయి.
  • ఉర్దూ మాధ్యమం గల వారికి కర్నూలు మాత్రమే పరీక్ష కేంద్రంగా ఉంటుంది.
  • ఎంపీసీ విద్యార్థులకు గణితం 80 మార్కులు, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40.. మొత్తం 160 మార్కులకు..
  • బైపీసీ విద్యార్థులకు ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40, బోటనీ 40, జువాలజీ 40.. మొత్తం 160 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
  • పశ్నలు, ఆప్షన్లు ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ఉంటాయి.
Published date : 29 Feb 2020 02:08PM

Photo Stories