మరో మూడు చోట్ల టీఎస్ ఎంసెట్ పరీక్ష కేంద్రాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పరీక్ష నిర్వహణ కోసం ఇదివరకు నిర్ణయించిన ప్రాంతాలతోపాటు మరో మూడు జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
ఈ మేరకు మార్చి 31న తెలంగాణ ఉన్నత విద్యా కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. మే 2వ తేదీ నుంచి నిర్వహించనున్న ఎంసెట్ కోసం తెలంగాణ, ఏపీల్లో కలిపి 14 చోట్ల పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తొలుత ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదిలాబాద్, సిద్దిపేట, మహబూబ్‌నగర్ జిల్లాలలోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీ సెట్‌ను కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల పరిధిలో వేర్వేరుగా నిర్వహించాలని నిర్ణయించారు. దీనికితోడు వరుసగా మూడేళ్లలో 25 శాతంలోపే సీట్లు భర్తీ అయిన ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ఈసారి ప్రవేశాలు చేపట్టవద్దని ప్రతిపాదించినట్టు తెలిసింది.
Published date : 02 Apr 2018 03:29PM