మే 8న ఏపీ ఎంసెట్
Sakshi Education
డీఎస్సీ, కేసెట్ కారణంగా పరీక్ష తేదీలో మార్పు<br/>
నేడు నోటిఫికేషన్ విడుదల చేయనున్న కన్వీనర్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్) పరీక్ష తేదీని రెండు రోజులు ముందుకు జరిపి మే 8న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఈ పరీక్ష తేదీని మే 10గా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు డీఎస్సీ (టీచర్ రిక్రూట్‌మెంటు టెస్టు), కేసెట్ పరీక్షలు ఉండటంతో షెడ్యూల్‌ను రెండు రోజులు ముందుకు జరుపుతున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం సచివాలయంలోని ఆయన చాంబర్లో మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విన్నపాలతో పాటు పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష కోసం 250 కేంద్రాలు, మెడికల్ ప్రవేశ పరీక్ష కోసం 125 కేంద్రాలుంటాయని, 17 రీజనల్ కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 1.70 లక్షల ఇంజనీరింగ్ సీట్లు, 3,100 మెడికల్ సీట్లు ఉన్నాయని చెప్పారు. ఇతర సెట్ల తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదన్నారు. ఈ ఏడాది వరకు ఎంసెట్‌లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టంచేశారు.
సి-కేటగిరీ కాలేజీల మూసివేత
రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌తో సహా డిగ్రీ కాలేజీలన్నిటికీ గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తామని మంత్రి చెప్పారు. ఏబీసీ కేటగిరీల కింద వీటికి గ్రేడింగ్ ఇవ్వనున్నామని తెలిపారు. కొంతకాలం సమయం ఇస్తామని, సి-కేటగిరీ ల్లోని కాలేజీల్లో మార్పు లేకపోతే వాటి మూసివేత తప్పదని గంటా స్పష్టంచేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఐఐటీ, ఐఐఎంలలో ప్రవేశాలు జరుగుతాయని, తక్కిన వాటిని కూడా క్రమేణా ప్రారంభిస్తామని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో విద్యాశాఖకు ఆశించిన స్థాయిలో నిధులు కేటాయింపు కాలేదని మంత్రి పేర్కొన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత , ఉన్నత పాఠశాలలకు సంబంధించి టీచర్ల రేషనలైజేషన్ వచ్చే విద్యా సంవత్సరానికి ముందే చేపడతామని చెప్పారు. విద్యాహక్కు చట్టం ప్రకారం టీచర్లు, విద్యార్థుల నిష్పత్తి ఉండేలా చూస్తామని తెలి పారు. క్లస్టర్ స్కూళ్ల ఏర్పాటువల్ల ఇతర స్కూళ్లు మూతపడ వన్నారు.
ఏపీలో సమర్థులనేకులున్నారు: వేణుగోపాలరెడ్డి
ఉమ్మడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ జేఎన్టీయూకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ వచ్చామని, ఏపీలోనూ ఈపరీక్షలను నిర్వహించే సమర్థత, శక్తిసామర్థ్యాలున్న నిపుణులనేకమంది ఉన్నారని, ఏపీలోని అన్ని వర్సిటీలకూ ఈ శక్తి ఉందని మీడియా సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి చెప్పారు. అంతకుముందు ఉన్నత విద్యామండలిలో ఎంసెట్ కమిటీ సమావేశమై సెట్ విధివిధానాలు ఖరారు చేసింది. దీనిలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుమితా దావ్రా, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సిసోడియా, కమిషనర్ సంధ్యారాణి, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ విజయప్రకాశ్, ఎంసెట్ చైర్మన్ ప్రభాకరరావు, కన్వీనర్ సాయిబాబు, ఎంసెట్ క్యాంపు ఆఫీసు కో ఆర్డినేటర్ రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. ఎంసెట్ నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానుంది. కన్వీనర్‌గా ఉన్న జేఎన్టీయూ (కాకినాడ) ప్రొఫెసర్ సాయిబాబు ఈ నోటిఫికేషన్ విడుదలచేయనున్నారు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఇదీ షెడ్యూల్..
ఇతర సెట్లు, వాటి తేదీలు

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం | మార్చి 6 |
ఫైన్ లేకుండా చివరి గడువు | ఏప్రిల్ 11 |
రూ.500 ఫైన్‌తో గడువు | ఏప్రిల్ 16 |
రూ.1,000 ఫైన్‌తో గడువు | ఏప్రిల్ 22 |
రూ.5 వేల ఫైన్‌తో గడువు | మే 2 |
రూ.10 వేల ఫైన్‌తో గడువు | మే 6 |
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ | మే 2 - మే 6 |
ఎంసెట్ పరీక్ష తేదీ | మే 8 |
ఇతర సెట్లు, వాటి తేదీలు
సెట్‌పేరు | తేదీ | వర్సిటీ |
ఈసెట్ | మే14 | ఏయూ |
పీఈసెట్ | మే14 | ఏఎన్‌యూ |
ఐసెట్ | మే16 | జేఎన్టీయూఏ |
పీజీసెట్ | మే25 | ఎస్‌కేయూ |
ఎడ్‌సెట్ | మే28 | ఎస్‌వీయూ |
లాసెట్/పీజీలాసెట్ | మే30 | జేఎన్టీయూకే |
Published date : 03 Mar 2015 11:51AM