Skip to main content

మే 5న ఎంసెట్ ఫలితాలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఎంసెట్-2017 ఫలితాలు మే 5న విడుదల చేయనున్నామని కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబు తెలిపారు.
తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పరీక్షలు ఈనెల 28 తో ముగిశాయి. ఈనెల 24, 25, 26 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు జరగ్గా, ఈనెల 28న బైపీసీ విభాగం విద్యార్ధులకు పరీక్షలు జరిగాయి. ఈసారి ఎంబీబీఎస్, డెంటల్ కోర్సులకు సంబంధించి నీట్ ఉండడంతో ఆ విద్యార్ధులు ఎంసెట్‌కు దరఖాస్తు చేయలేదు. అయినప్పటికీ గతంలో కన్నా ఈసారి ఎంసెట్‌కు దరఖాస్తులు అంచనాకంటే ఎక్కువగా రావడం విశేషం. మూడురోజుల పాటు జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 1,87,454 మంది హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మా తదితర బైపీసీ విభాగపు ప్రవేశపరీక్షకు సంబంధించి ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో కలిపి 80,843 మందికి గాను 75, 381 మంది హాజరయ్యారు.

ఆ విద్యార్థ్ధులు మార్కుల జాబితాలు పంపాలి :
ఎంసెట్ ఫలితాలను మే 5న విడుదల చేయాలని నిర్ణయించినందున ఇంటర్మీడియెట్ కాకుండా సీబీఎస్‌ఈ, ఏపీఓఎస్‌ఎస్, ఎన్‌ఐఓఎస్, డిప్లొమో, ఆర్జేయూ కేటీ, ఐఎన్‌సీ, ఇంటర్మీడియెట్ ఒకేషనల్ ఇతర బోర్డుల ధ్రువపత్రాలతో పరీక్షలకు హాజరైన విద్యా ర్థులు ప్రత్యేక డిక్లరేషన్ ఫారాలను, మార్కుల జాబి తాలను తమకు ముందుగా పంపాలన్నారు. ఎంసెట్ వెబ్‌సైట్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫార్మా విభాగాలకు విడివిడిగా పొందుపరిచిన డిక్లరేషన్ ఫారాలను, అటెస్టేషన్‌తో కూడిన మార్కుల జాబి తాలను నిర్ణీత ఈమెయిల్ అడ్రస్‌కు లేదా పోస్టు ద్వారా ఎంసెట్ కార్యాలయానికి పంపించాలన్నా రు. అప్పుడే వారి మార్కులకు వెయిటేజీ తీసుకొని ఎంసెట్ మార్కులతో ర్యాంకులు వెల్లడిస్తా మన్నారు.
Published date : 29 Apr 2017 03:04PM

Photo Stories