Skip to main content

మే 3న ఏపీ ఎంసెట్ ఫలితాలు

సాక్షి, అమరావతి:ఏపీ ఎంసెట్ ప్రిలిమనరీ కీని ఏప్రిల్ 25న విడుదల చేయనున్నామని ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు.
దీన్ని ఎంసెట్ వెబ్‌సైట్లో పొందుపరుస్తామన్నారు. విద్యార్థులు తమ ప్రశ్నపత్రాన్ని కీతో పోల్చిచూసుకునేందుకు వారి ఆన్‌లైన్ జవాబుపత్రాన్ని ఈమెయిల్‌కు పంపిస్తామని చెప్పారు. జవాబు పత్రాలను వెబ్‌సైట్లోనూ పొందుపర్చనున్నట్లు వివరించారు. అభ్యర్థులు వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ప్రిలిమనరీ కీపై అభ్యంతరాలను ఏప్రిల్ 27 వరకు స్వీకరిస్తామని, తుది ఫలితాలను, ర్యాంకులను మే 3న ప్రకటిస్తామని వెల్లడించారు.
Published date : 24 Apr 2018 04:27PM

Photo Stories