Skip to main content

మే 24న ఏపీఎంసెట్ మలివిడత ర్యాంకుల ప్రకటన

సాక్షి, అమరావతి: ఏపీ ఎంసెట్-2018కు సంబంధించి ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు కాకుండా సీబీఎస్‌ఈ, ఏపీఓఎస్‌ఎస్, టీఎస్‌ఓఎస్, డిప్లమో, ఆర్‌జీయూకేటీ, ఐఎస్‌పీ, ఇంటర్మీడియెట్ ఒకేషనల్, ఇతర బోర్డుల నుంచి ఎంసెట్ పరీక్షకు హాజరై అర్హత సాధించి డిక్లరేషన్ ఫారాలను సమర్పించిన అభ్యర్థుల ర్యాంకులను మే 24న ప్రకటించనున్నామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
ర్యాంకులను అభ్యర్థుల మొబైల్ నెంబర్లకు సంక్షిప్త సమాచారం ద్వారా పంపిస్తామన్నారు. తెలంగాణ, ఏపీ ఇంటర్మీడియెట్‌బోర్డుల ద్వారా ఫలితాల పునర్మూల్యాంకనం, పునర్లెక్కింపులతో కొత్తగా మార్కులు పొందిన అభ్యర్థుల డేటాను రప్పించి వారికి కూడా తాజా ర్యాంకులు ప్రకటించనున్నామని వివరించారు. ఇలా 2363 మంది ర్యాంకులు ప్రకటించనున్నారు. ఇంటర్మీడియెట్ కాకుండా వేరే బోర్డుల నుంచి ఎంసెట్ పరీక్షకు హాజరైన 11330 మంది విద్యార్థులు ఇంటర్ మార్కులు అందజేయనందున వారికి ర్యాంకులు ప్రకటించలేదని, వారు మార్కులు అందజేస్తే ర్యాంకులు ప్రకటిస్తామని తెలిపారు
Published date : 24 May 2018 03:45PM

Photo Stories