మే 19న టీఎస్ ఎంసెట్ ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలను మే 19న విడుదల చేయాలని సెట్ కమిటీ నిర్ణయించింది.
మే 17న ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన కమిటీ సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఎంసెట్ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫలితాల విడుదలపై నిర్ణయం తీసుకున్నారు. అయితే ఫలితాల వెల్లడి సమయం, ప్రదేశాన్ని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వీలును బట్టి మే 18న ఖరారు చేయాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు. వాస్తవానికి 18నే ఫలితాలను విడుదల చేయాలని భావించినప్పటికీ కడియం వరంగల్‌లో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉన్నందున 19వ తేదీకి వాయిదా వేశారు.
Published date : 18 May 2018 02:29PM