మార్చి 6న టీఎస్ ఎంసెట్– 2021 కమిటీ సమావేశం.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కమిటీ సమావేశం ఈనెల 6వ తేదీన నిర్వహించేందుకు ఎంసెట్ కమిటీ చర్యలు చేపట్టింది.
ఎంసెట్‌లో పరిగణనలోకి తీసుకునే సిలబస్, దరఖాస్తుల తేదీలను, పరీక్ష ఫీజు వివరాలను అదేరోజు ఖరారు చేయనుంది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలోని 100% సిలబస్, ద్వితీయ సంవత్సరంలోని 70% సిలబస్ ఆధారంగానే ఎంసెట్ నిర్వహించనుంది. మరోవైపు కరోనా కారణంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఎంసెట్‌లో ఎక్కువ ఆప్షన్లు ఉండేలా చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి భావించింది. 160 ప్రశ్నలకు బదులు 180 ప్రశ్నలు ఇచ్చి, 160 ప్రశ్నలకే సమాధానాలు రాసేలా చర్యలు చేపట్టే అంశంపై 6ననిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇక జూలై 5–9వ తేదీ వరకు నిర్వహించనున్న ఎంసెట్ కోసం మార్చి 10వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది.
Published date : 03 Mar 2021 05:39PM