కోవిడ్‌తో టీఎస్ ఎంసెట్‌కు గైర్హాజరైనవారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: గతనెలలో ఎంసెట్ పరీక్ష రాయలేని కోవిడ్ సోకిన విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గతనెల 9 నుంచి 14 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో కొందరు విద్యార్థులకు కోవిడ్-19 పాజిటివ్ లక్షణాలు ఉండడంతో రాయలేకపోయారు. ఇప్పుడు అలాంటి అభ్యర్థులకు చివరగా మరో అవకాశం కల్పించి పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎంసెట్-20 కన్వీనర్ ఎ.గోవర్ధన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా అభ్యర్థులు హామీపత్రంతో పాటు కోవిడ్-19 పాజిటివ్, నెగెటివ్ రిపోర్ట్‌ను ఎంసెట్ వెబ్‌సైట్‌లో రేపటిలోగా అప్‌లోడ్ చేయాలని సూచించారు.
Published date : 05 Oct 2020 03:36PM