జూన్‌లో ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్
Sakshi Education
కాకినాడ: ఎంసెట్ తొలివిడత కౌన్సెలింగ్ జూన్‌లోను, రెండో విడత జూలైలోలోను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు చెప్పారు.
కాకినాడలో మే 10న ఆయన మాట్లాడుతూ ఆగస్టు మొదటి వారంలో తరగతుల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రాథమిక కీ విడుదల చేశామని, ఇప్పటికి ఇంజనీరింగ్‌పై 4, మెడిసిన్‌పై 10 అభ్యంతరాలు వచ్చాయని చెప్పారు. ఈ నెల 15 వరకు అభ్యంతరాల స్వీకరణకు గడువుందని తెలిపారు. ఎంసెట్‌లో కాకినాడలో రెండు, కర్నూలు, విజయవాడల్లో ఒక్కొక్కటి మొత్తం నాలుగు మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదైనట్లు చెప్పారు. వారిపై చర్యలకు కమిటీని నియమిస్తామన్నారు.
Published date : 11 May 2015 03:51PM