జూన్ 7 నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్!
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తది తర కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ జూన్ మొదటి వారంలో జరిగే అవకాశముంది.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ, ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. కౌన్సెలింగ్ తేదీల ఖరారుపై ఈ నెల 22న అడ్మిషన్ల కమిటీ భేటీ కానుంది. జూన్ 7 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించాలంటూ అడ్మిషన్ల కమిటీకి సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పండాదాస్ ప్రతిపాదన చేశారు. అడ్మిషన్ల కమిటీ సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎంసెట్‌ను ఏప్రిల్ 24, 25, 26, 28 తేదీల్లో ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్ విభాగంలో 1,87,454 మంది పరీక్షకు హాజరవ్వగా 1,49,505 మంది అర్హత సాధించారు. ఇందులో తెలంగాణ నుంచి పరీక్ష రాసిన వారిలో 15,216 మంది ఉన్నారు. ఎంసెట్‌లో అర్హత సాధించినా ఇంటర్‌లో ఉత్తీర్ణులు కాని వారిని మినహాయించి 1,39,190 మందికి ర్యాంకులు ప్రకటించారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 75,381 మంది పరీక్ష రాయగా.. 68,882 మంది అర్హత సాధించారు. వీరిలో ఇంటర్‌లో పాస్ కానివారిని మినహాయించి 64,379 మందికి మాత్రమే ర్యాంకులు ప్రకటించారు.
ఆన్‌లైన్ వెరిఫికేషన్ కష్టం: ఇదిలాఉండగా, అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను ఆన్‌లైన్‌లో చేపడితే ఎలా ఉంటుందన్న అంశంపై ఉన్నత విద్యామండలి ఆలోచనలు చేసింది. కానీ చివరకు ఇది సాధ్యమయ్యే పనికాదన్న అభిప్రాయానికి వచ్చింది. గతంలో మాదిరిగానే ప్రధాన కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. జూన్ 19 నుంచి తరగతులు ప్రారంభిస్తామని మంత్రి గంటా ప్రకటించినందున అంత కు ముందే ప్రవేశాలు పూర్తిచేయాలని భావిస్తున్నారు.
జేఈఈ ప్రవేశాలకు ముందు కౌన్సెలింగ్ ఇబ్బందే..
జేఈఈ మెయిన్‌స గత నెలలో పూర్తయిన సంగతి తెలిసిం దే. జేఈఈ అడ్వాన్సు ఈ నెల 21న జరగ నుంది. ఆ తర్వా త వాటి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. అలాగే జాతీ య స్థాయిలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల ప్రవేశాలు కూడా ఇంకా జరగాల్సి ఉంది. అంతకు ముందుగా ఏపీ ఇంజనీరింగ్ ప్రవేశాలు నిర్వహిస్తే.. ఆ తర్వాత ఐఐటీ, ఎన్‌ఐటీ సంస్థల్లో అవకాశాలు వచ్చిన వారు వీటిని వదులుకొని వెళ్లిపోయే అవకాశముందని చెబుతున్నారు. అదే జరిగితే ఆయా స్థానాలు మళ్లీ ఖాళీ అవుతాయి. దీని వల్ల మెరిట్ విద్యార్థులు నష్ట పోయే ప్రమాదముంటుంది. మళ్లీ వీరంతా రెండో కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సి వస్తుంది.

Published date : 16 May 2017 02:25PM