Skip to main content

జులై 9న తెలంగాణ ఎంసెట్ మెడికల్ ప్రవేశ పరీక్ష

హైదరాబాద్: తెలంగాణ‌లో ఎంబీబీఎస్‌, బీడీస్ ప్రవేశాల‌ కోసం ఎంసెట్ -2 (2016) పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు ఎంసెట్-2 షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం సెక్రటేరియట్లో వెల్లడించారు. ఈ నెల 28న ఎంసెట్-2కు నోటిఫికేషన్ వెలువడనుంది. జులై 9న తెలంగాణ మెడికల్ ప్రవేశ పరీక్ష నిర్వహించి, 14న ఫలితాలను విడుదల చేయనున్నారు. జూన్‌ 1వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

ముఖ్యమైన తేదీలు:
*మే 28న ఎంసెట్-2 నోటిఫికేషన్
*ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభ తేదీ: జూన్ 1
*ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ: జూన్ 7
*హాల్ టికెట్స్ డౌన్‌లోడ్‌: జూలై 2 - 7
* తెలంగాణ స్టేట్ ఎంసెట్-2 పరీక్ష: జూలై 9 (అదే రోజు ప్రాథ‌మిక కీని విడుద‌ల చేస్తారు)
*ర్యాంకుల ప్రకటన: జూలై 14

రిజిస్ట్రేషన్ ఫీజుల వివరాలు:
* ఎస్సీ, ఎస్టీలకు రూ.250, ఇతరులకు రూ. 500
*రూ. 500 అప‌రాద రుసుంతో జూన్ 14 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు
*రూ. 1000 అప‌రాద రుసుంతో జూన్ 21 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు
*రూ. 5000 అప‌రాద రుసుంతో జూన్ 28 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు
*రూ. 10000 అప‌రాద రుసుంతో జూలై 6 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు
Published date : 25 May 2016 03:21PM

Photo Stories