జూలై 7న ఎంసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఎంసెట్ - 2018 రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా జూలై 7నఅభ్యర్థులకు సీట్లు కేటాయించనున్నారు.
రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు 3,165 మంది హాజరయ్యారు. వీరు 37,918 వెబ్ ఆప్షన్లు నమోదు చేశారు. కన్వీనర్ కోటాలో మొత్తం 95,355 సీట్లుండగా అందులో మొదటి విడత కౌన్సెలింగ్‌లో 60,943 సీట్లను కేటాయించారు. సీట్లు పొందినవారిలో 49,712 మంది మాత్రమే కాలేజీల్లో రిపోర్ట్ చేశారు. 11,231 మంది రిపోర్ట్ చేయలేదు. కాగా, రెండో విడత కౌన్సెలింగ్‌కు 46,283 సీట్లు అందుబాటులో ఉన్నాయని కన్వీనర్ జీఎస్ పండాదాస్ పేర్కొన్నారు.
Published date : 07 Jul 2018 02:18PM