జూలై 10 వరకు ఎంసెట్ వెబ్ ఆప్షన్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్ రెండో దశ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా జూలై 7 నుంచి 10వ తేదీ వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని తెలంగాణ ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు.
ఇంతవరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాని వారంతా జూలై 7వ తేదీన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని పేర్కొన్నారు. హెల్ప్‌లైన్ కేంద్రాల వివరాలను వెబ్‌సైట్లో పొందవచ్చని సూచించారు. వెరిఫికేషన్‌కు హాజరుకావాలనుకునే వారు ముందుగా వెబ్‌సైట్లో రిజిస్టర్ చేసుకొని ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని తెలిపారు. స్పెషల్ కేటగిరీల వారికి మాసబ్‌ట్యాంకులోని సాంకేతిక విద్యా భవన్లో వెరిఫికేషన్ ఉంటుందని వెల్లడించారు.
Published date : 07 Jul 2018 02:42PM