Skip to main content

ఈనెల 15 ఎంసెట్ దరఖాస్తుకు ఆఖరి తేది

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరిం గ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ దరఖాస్తుల గడువు ఈనెల 15తో ముగియనుంది.
మే 12న నిర్వహించే పరీక్ష రాసేందుకు ఈనెల 13 రాత్రి వరకు మొత్తం 2,00,482 మంది విద్యా ర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ కో సం 1,27,820 మంది దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్ కోసం 70,102 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండింటి కోసం 1,280 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్ అధికారులు తెలిపారు. ఈనెల 16 నుంచి 21 వరకు దరఖా స్తుల్లో పొరపాట్లు ఉంటే సవరించుకునేందుకు విద్యార్థులకు అధికారులు అవకాశం కల్పించారు. అలాగే 16 నుంచి విద్యార్థులు ఆలస్య రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆలస్య రుసుముతో షెడ్యూలు :
21-4-2017:
రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు
27-4-2017: రూ.1,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు
3-5-2017: రూ.5 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు
1-5-2017నుంచి 9-5-2017 వరకు: వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
8-5-2017: రూ.10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి గడువు
12-5-2017: రాత పరీక్ష (ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష మధాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు).
Published date : 14 Apr 2017 01:51PM

Photo Stories