ఇంటర్ సప్లిమెంటరీ ఉత్తీర్ణులైన వారికి 21 నుంచి వెరిఫికేషన్
Sakshi Education
తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఉత్తీర్ణులై ఎంసెట్‌లో ర్యాంకులు పొందిన విద్యార్థులకు ఈ నెల 21న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు.
ఈ నెల 21న మధ్యాహ్నం 2 గంటలకు 98,001 ర్యాంకు నుంచి 1,01,000 ర్యాంకు వరకు, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 1,01,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని వివరించారు. ఈనెల 19న 80 వేల ర్యాంకు వరకు విద్యార్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలవగా, 50,691 మంది విద్యార్థులు వెరిఫికేషన్ చేయించుకున్నట్లు వెల్లడించారు. 19 నాటికి 56 వేల ర్యాంకు లోపు వారికి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించగా 35,529 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు తెలిపారు. 56,001వ ర్యాంకు నుంచి 80 వేల ర్యాంకు వరకు విద్యార్థులకు ఈనెల 19న లాగిన్ ఐడీలు పంపించినట్లు తెలిపారు. వారు ఈ నెల 20 ఉదయం 11 గంటల నుంచి 22 ఉదయం 11 గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వివరించారు.
Published date : 20 Jun 2017 03:12PM