హైదరాబాద్‌లో ఏపీ ఎంసెట్ కేంద్రాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏపీ ఎంసెట్ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినట్లు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
దీంతో ఏప్రిల్ 29న జరిగే ఏపీ ఇంజనీరింగ్, మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హైదరాబాద్, సికింద్రాబాద్‌లతో పాటు రంగారెడ్డి జిల్లాలో కేటాయించిన పరీక్ష కేంద్రాలను ఈనెల 29 నుంచి ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పటికే ఇతర కేంద్రాల్లో పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా ఆసక్తి ఉన్న పక్షంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు.
Published date : 29 Feb 2016 02:30PM