Skip to main content

హైదరాబాద్‌లో 25 ఏపీ ఎంసెట్ కేంద్రాలు

సాక్షి, హైదరబాద్: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌కు సంబంధించి హైదరాబాద్‌లో 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు.
గతంలో కన్నా ఈసారి రెట్టింపు సంఖ్యలో 44వేల మంది అభ్యర్థులు ఉస్మానియా (తెలంగాణ) వర్సిటీ పరిధి నుంచి ఏపీ ఎంసెట్‌కు దరఖాస్తు చేశారు. గతేడాది25వేల మంది మాత్రమే ఈ పరీక్షకు దరఖాస్తు చేశారు. ఈసారి అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో పరీక్ష కేంద్రాల సంఖ్యను కూడా పెంచారు.

పరీక్ష కేంద్రాలివే:
మెహిదీపట్నం రీజియన్ పరిధిలో భాస్కర ఇంజనీరింగ్ కాలేజీ, గ్లోబల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ (మొయినాబాద్), జేబీ ఇంజనీరింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ అండ్ టెక్నాలజీ (ఎన్కేపల్లి, మొయినాబాద్), కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (చిల్కూరు, మొయినాబాద్), విద్యాజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (హిమాయత్‌నగర్), ఆల్ హబీబ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ (దామెరగిద్ద, చేవెళ్ల), జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్ (షేక్‌పేట్, హైదరాబాద్), జి.పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ (మెహిదీపట్నం), సెయింట్‌ఆన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ (సంతోష్‌నగర్ కాలనీ, మెహిదీపట్నం), చైతన్యభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (గండిపేట, రాజేంద్రన గర్), మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కోకాపేట్, రాజేంద్రనగర్). కూకట్‌పల్లి రీజియన్ పరిధిలో వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, గోకరాజు రంగరాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (బాచుపల్లి, నిజాంపేట్), రిషి ఎంఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ (జేఎన్‌టీయూ దగ్గర, నిజాంపేట్), డీఆర్‌కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ (బౌరంపేట్, కుత్బుల్లాపూర్), డీఆర్కే ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ప్రగతి నగర్, బౌరంపేట్, కుత్బుల్లాపూర్), హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంటు (గౌడవెల్లి, మేడ్చల్), ఎంఎల్‌ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (గండిమైసమ్మ క్రాస్‌రోడ్, కుత్బుల్లాపూర్), మర్రి లక్ష్మారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (దుండిగల్, కుత్బుల్లాపూర్), నరసింహారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్‌మెంటు, మల్లారెడ్డి కాలేజ్‌ఆఫ్ ఇంజనీరింగ్, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (మైసమ్మగుడ, దూలపల్లి), సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ (మైసమ్మగుడ, దూలపల్లి).
Published date : 14 Apr 2016 02:20PM

Photo Stories