Skip to main content

ఏప్రిల్ 18న ‘సాక్షి’ మాక్ ఎంసెట్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని లక్షలాది మంది ఇంజనీరింగ్, మెడికల్ ఔత్సాహిక విద్యార్థులకు ప్రయోజనం కల్పించేలా సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో ‘సాక్షి మాక్ ఎంసెట్-2016’ను నిర్వహిస్తున్నారు.
ఇరు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 18వ తేదీన ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది. గత ఏడాది కూడా ‘సాక్షి’ నిర్వహించిన మాక్ ఎంసెట్‌కు దాదాపు 20 వేల మంది హాజరై తమ ప్రతిభకు పదునుపెట్టుకున్నారు. ఈ మాక్ ఎంసెట్ ప్రశ్నపత్రాలను ‘సాక్షి భవిత’కు సంబంధించిన సీనియర్ లెక్చరర్లు రూపొందిస్తారు. ఎంసెట్ పరీక్షలకు పదిహేను రోజుల ముందు నిర్వహించే ఈ నమూనా పరీక్ష విద్యార్థులు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడమే కాకుండా ప్రతిభను పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది. రూ. 100 చెల్లించి ‘సాక్షి’ మాక్ ఎంసెట్ దరఖాస్తు ఫారాన్ని పొందవచ్చు. రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు వెంట తీసుకుని వస్తే వెంటనే హాల్‌టికెట్ కూడా పొందవచ్చు. దరఖాస్తు ఫారాలు లభించే కేంద్రాలు, పరీక్ష కేంద్రాల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఇంజనీరింగ్, మెడికల్ విభాగాలలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి వేర్వేరుగా టాప్-10 ర్యాంకులు పొందినవారికి బహుమతులు అందజేస్తారు. ఇంటర్ కళాశాల నిర్వాహకులు ఏకమొత్తంగా ఈ మాక్ ఎంసెట్‌కు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మాక్ ఎంసెట్‌కు సంబంధించి సెంట్రల్ ఆంధ్రాలో 9666372301 నంబర్‌లో, ఉత్తరాంధ్ర 9666283534, రాయలసీమ 9640033107, తెలంగాణలో 9505514424, 9666421880 నంబర్లలో సంప్రదించవచ్చు.
Published date : 29 Feb 2016 02:28PM

Photo Stories