ఏపీలో టీఎస్ ఎంసెట్ కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు
Sakshi Education
బాలాజీచెరువు (కాకినాడ): ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, తిరుపతి నగరాల్లో తెలంగాణ ఎంసెట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆ రాష్ర్ట విద్యా మంత్రి కడియం శ్రీహరికి రాష్ర్ట మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఉన్నత విద్య (ఏపీఎస్‌హెచ్‌ఈ) పరీక్షల నిర్వహణ, అడ్మిషన్ల ప్రత్యేకాధికారి డాక్టర్ కె.రఘునాథ్ ఈ విషయం వెల్లడించారు. కాకినాడ జేఎన్‌టీయూలోని ఏపీ ఎంసెట్ కార్యాలయాన్ని సోమవారం సందర్శించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఏపీ ఎంసెట్‌కు తెలంగాణలో కేంద్రాలు ఏర్పాటు చేశామని, అలాగే తెలంగాణ ఎంసెట్‌కు ఏపీలో కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు.
Published date : 01 Mar 2016 02:28PM