Skip to main content

ఏపీలో ఎంసెట్ లీకేజీ కాలేదు

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ మెడికల్ ప్రవేశ పరీక్ష పత్రం లీకు కాలేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని పేర్కొన్నారు.
గురువారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. పోలీసులు, ఎంసెట్ నిర్వహించిన అధికారులతో మాట్లాడి, ధ్రువీకరించుకున్న తర్వాతే తాను ఈ విషయాన్ని చెబుతున్నానని తెలిపారు. ఎంసెట్ లీకు అయ్యిందని కొంతమంది దుష్ర్పచారం చేస్తున్నారని, సున్నితమైన అంశాలను రాజకీయం చేయడం తగదన్నారు. వచ్చే నెల 6, 7, 8 తేదీల్లో ఏపీలో మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. పీజీ సీట్ల విషయంలో అడ్మిషన్లు తీసుకోబోయే విద్యార్థులకు మూడు సార్లు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. పీజీలో అడ్మిషన్లు తీసుకునే విద్యార్థుల నుంచి ఇకపై అదనంగా రూ. 2 లక్షల డిపాజిట్ తీసుకుంటామని, ఒరిజినల్ సర్టిఫికెట్స్ ముందుగానే కళాశాలకు సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. రెండోసారి కౌన్సెలింగ్ విషయంలో నిర్ధారణ ఇవ్వాలని, లేదంటే సంబంధిత విద్యార్థి ఒరిజనల్ సర్టిఫికెట్లు, రూ. 2 లక్షల డిపాజిట్ ప్రభుత్వ కళాశాలకే చెందుతుందన్నారు.
Published date : 29 Jul 2016 02:39PM

Photo Stories