ఏపీలో 19 నుంచి ఎంసెట్ హాల్‌టికెట్ల జారీ
Sakshi Education
సాక్షి, అమరావతి: ఈనెల 24వ తేదీనుంచి ఆన్‌లైన్లో జరగనున్న ఏపీ ఎంసెట్-2017కు 19 నుంచి హాల్‌టికెట్లను ఆన్‌లైన్లో జారీచేయనున్నారు.
ఎంసెట్‌కు 2,77,600 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. గతంలోకన్నా ఇంజనీరింగ్ విభాగంలో 20 వేల దరఖాస్తులు పెరిగాయి. బైపీసీ విభాగంలో 79,800 దరఖాస్తులు వచ్చాయి. ఎంబీబీఎస్, డెంటల్ కోర్సులకు నీట్ నిర్వహిస్తుండడంతో ఈసారి ఆ మేరకు దరఖాస్తులు తగ్గాయి. బైపీసీ విభాగంలో గతంలో కన్నా 17 వేల దరఖాస్తులు తగ్గినట్లు అధికారులు చెప్పారు. ఎంసెట్ హాల్‌టిక్కెట్లను అభ్యర్థులు సెట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది. అభ్యర్థులకు పరీక్ష కేంద్రంతోపాటు పరీక్ష రాసే సమయాన్ని కూడా అధికారులే నిర్ణయించి హాల్‌టికెట్లలో పొందుపరుస్తారు. ఈనెల 24, 25, 26 తేదీల్లో 148 కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో ఎంసెట్ నిర్వహిస్తారు. బైపీసీ విభాగం అభ్యర్థులకు ఈనెల 28న 136 కేంద్రాల్లో పరీక్ష ఉంటుంది.
Published date : 19 Apr 2017 01:31PM