ఏపీ ఎంసెట్‌కు మార్చి 29 వరకు గడువు
Sakshi Education
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2018కు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా మార్చి 29 లోగా దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు.
అగ్రికల్చరల్, ఇంజినీరింగ్ విభాగాలకు కలిపి ఇప్పటి వరకూ లక్షా 63వేల 561 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, రూ.500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 6 వరకు, రూ.వెయి్య అపరాధ రుసుముతో ఏప్రిల్ 11 వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో ఏప్రిల్ 16 వరకు, రూ.10వేల అపరాధ రుసుముతో ఏప్రిల్ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్థులు ఎంటర్ చేసిన సెల్ నెంబర్‌కు సమాచారం వస్తుందని, స్క్రైబ్‌కు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత ధ్రువపత్రాలతో కాకినాడ జేఎన్‌టీయూకే ఎంసెట్ కార్యాలయానికి వచ్చి అనుమతి పొందాలని సూచించారు. హాల్ టిక్కెట్లు ఏప్రిల్ 18వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, పరీక్ష ఏప్రిల్ 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ఏప్రిల్ 25, 26 తేదీల్లో అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఉర్దూ అనువాదం కావాలనుకునే అభ్యర్థులకు రాష్ట్రవ్యాప్తంగా ఒక్క కర్నూల్‌లో మాత్రమే కేంద్రం ఏర్పాటు చేశామని, ఎంసెట్ దరఖాస్తులో తప్పుల సవరణకు ఏప్రిల్ 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ సరి చేసుకునేందుకు అనుమతి ఇచ్చామన్నారు. ఇతర వివరాలకు హెల్ప్‌లైన్ సెంటర్ 0884-2340535 నంబరులో సంప్రదించవచ్చన్నారు.
Published date : 22 Mar 2018 02:23PM