ఏపీ ఎంసెట్‌కు మార్చి 17లోగా దరఖాస్తు చేసుకోవాలి
Sakshi Education
బాలాజీ చెరువు (కాకినాడ): ఏపీ ఎంసెట్-2017కు హాజరయ్యే అభ్యర్థులు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా మార్చి 17లోగా దరఖాస్తు చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు.
రూ. 500 అపరాధ రుసుముతో మార్చి 26 వరకు, రూ. 1000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 10 వరకు, రూ. 5 వేలు అపరాధ రుసుముతో 17 వ తేదీ వరకూ, రూ. 10 వేలు అపరాధ రుసుముతో 22 వతేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు ఏప్రిల్ 19 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. పరీక్ష ఒక స్ట్రీమ్‌కు రూ.450, రెండు స్ట్రీమ్‌లకు రూ.900 తోపాటు లావాదేవి ఛార్జీలు అదనంగా చెల్లించాలని సూచించారు. ఇంజినీరింగ్ పరీక్ష ఏప్రిల్ 24, 25 ,26, 27 తేదీల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ జరుగుతుందన్నారు. అగ్రికల్చర్, బీఫార్మశీ, డీపార్మశీ, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్ వంటి కోర్సులకు 28వ తేదీన, రెండు విభాగాలకు హాజరయ్యే అభ్యర్థులకు పైన తెలిపిన తేదీల ప్రకారం పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ సంవత్సరం పరీక్ష అన్‌లైన్‌లో జరుగుతున్న నేపధ్యంలో జిల్లాకు మూడు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అభ్యర్థుల సంఖ్య ప్రకారం పెంచుతామని, హైదరాబాద్‌లో కూడా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. టీసీఎస్, ఏపీ అన్‌లైన్ సంస్థల భాగస్వామ్యంతో అభ్యర్థులకు ఎటువంటి సమస్యలు రాకుండా పరీక్ష నిర్వహణకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
Published date : 10 Feb 2017 02:17PM