ఏపీ ఎంసెట్‌కు హైదరాబాద్‌లోనూ కేంద్రాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్ /బాలాజీచెరువు(కాకినాడ): ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌కు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్.సాయిబాబు తెలిపారు. హైదరాబాద్‌లోని మెహిదీపట్నం, టోలీచౌకి, గోల్కొండ, లంగర్‌హౌజ్, ఇబ్రహీంబాగ్, గండిపేట, రాయదుర్గం, షేక్‌పేట, గచ్చిబౌలి ప్రాంతాలు జోన్-ఏ పరిధిలో, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ప్రగతినగర్, నిజాంపేట్, బాచుపల్లి, చందానగర్, బీహెచ్‌ఈఎల్, పటాన్‌చెరు, కండ్లకోయ, జీడిమెట్ల, గండిమైసమ్మ, దూలపల్లి, గుండ్లపోచంపల్లి, దుండిగల్ ప్రాంతాలను జోన్-బీ పరిధిలో ఉన్నాయని వివరించారు. అభ్యర్థుల సంఖ్యను బట్టి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఏప్రిల్ 3 నుంచి 9 వరకు సవరణలకు అవకాశం
ఆన్‌లైన్ దరఖాస్తుల్లో సమాచారం పొందుపర్చడంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకోవడానికి ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు కన్వీనర్ చెప్పారు. ఎంసెట్ హాల్ టిక్కెట్లను ఏప్రిల్ 21 నుంచి 27వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులకు ఎమైనా సందేహాలుంటే 0884-2340535, 0884-2356255 నంబర్లలో సంప్రదించవచ్చని సాయిబాబు సూచించారు.

Published date : 16 Mar 2016 01:17PM