ఏపీ ఎంసెట్‌కు 2.54 లక్షల దరఖాస్తులు
Sakshi Education
బాలాజీచెరువు (కాకినాడ): ఏపీ ఎంసెట్-17 పరీక్షకు అన్‌లైన్ దరఖాస్తు గడువు ఈ నెల 21 వరకు పొడిగించినట్లు ఏపీ ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు ఈనెల 17న ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంసెట్ నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 17తో గడువు ముగిసిందని, అభ్యర్థుల అభ్యర్థన మేరకు పెంచామన్నారు, ఇప్పటి వరకు అన్‌లైన్‌లో 2.54 లక్షల దరఖా స్తులు వచ్చాయని తెలిపారు. ఉర్ధూ అనువాదం కావాలనుకునే అభ్యర్థులకు కర్నూలులో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. అన్‌లైన్ పరీక్ష నేపథ్యంలో విద్యార్థి నిర్దేశిత సమయంలో పరీక్ష కేంద్రానికి హాజరుకావాలని సూచించారు.
Published date : 18 Mar 2017 01:33PM