ఏపీ ఎంసెట్ తొలి విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు
వెబ్ ఆప్షన్ల నమోదు రెండుసార్లు వాయిదా పడగా.. ఎట్టకేలకు ఆగస్టు 3నసీట్ల కేటాయింపు పూర్తి చేశారు. ఎంసెట్‌లో 1,32,953 మంది అర్హత సాధించగా.. కౌన్సెలింగ్‌లో 68,134 మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. 64,369 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, ఫార్మా తదితర కోర్సులకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు 390 ఉండగా.. వాటిలో కన్వీనర్ కోటాలో 95,887 సీట్లున్నాయి. ప్రస్తుతం కౌన్సెలింగ్‌లో 60,114 మందికి సీట్లు కేటాయించగా.. ఇంకా 35,773 సీట్లు మిగిలాయి. స్పెషల్ కేటగిరీలో 480 సర్టిఫికెట్ల పరిశీలన సమాచారం రాకపోవడంతో వారికి సీట్లు కేటాయించలేదు. ఇంజనీరింగ్‌లో 274 కాలేజీలకుగాను 59,910 సీట్లు కేటాయించగా.. 32,484 సీట్లు మిగిలాయి. ఫార్మాలో 116 కాలేజీలకు గాను 204 సీట్లు భర్తీ కాగా.. 3,289 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో 173, ఫార్మా కాలేజీల్లో 177 సీట్లు మిగిలి ఉన్నాయి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 32,311 సీట్లు, ఫార్మా కాలేజీల్లో 3,112 సీట్లు మిగిలి ఉన్నాయి. 44 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
ఆగస్టు 5 నుంచి ఇంజనీరింగ్ తరగతులు :
తొలి విడత కౌన్సెలింగ్ పూర్తి కావడంతో తరగతులను ఈ ఆగస్టు 5 నుంచి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 8వ తేదీలోగా కాలేజీల్లో చేరాలి. కాలేజీల ఫీజులపై ప్రస్తుతం హైకోర్టులో అప్పీల్ చేస్తున్న నేపథ్యంలో తుది విడత కేటాయింపు పూర్తయ్యాక తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.
వివిధ విభాగాల్లో భర్తీ సీట్లు ఇలా..
కోర్సు | మొత్తం సీట్లు | తొలి విడతలోభర్తీ అయినవి |
సీఎస్‌ఈ | 23,569 | 17,670 |
ఈసీఈ | 21,069 | 18,710 |
మెకానికల్ | 16,645 | 7,018 |
ఈఈఈ | 12,879 | 6,302 |
సివిల్ | 12,401 | 5,391 |
బీఫార్మా | 3,493 | 204 |
ఐటీ | 2,963 | 2,814 |
అగ్రికల్చర్ | 568 | 331 |
కెమికల్ | 409 | 409 |
ఈఐఈ | 272 | 114 |
పెట్రోలియం | 227 | 100 |
సీఎస్టీ | 168 | 168 |
మైనింగ్ | 168 | 21 |
సీఎస్‌ఐటీ | 126 | 111 |
ఆటోమొబైల్ | 126 | 63 |
సీఎస్‌ఎస్‌ఈ | 125 | 115 |
ఫుడ్ టెక్నాలజీ | 93 | 66 |
మెటలర్జికల్ | 89 | 89 |
జియో ఇన్ఫర్మేటిక్స్ | 60 | 60 |
ఇన్‌స్ట్రుమెంటేషన్ | 60 | 60 |
నేవల్ | 60 | 60 |