ఏపీ ఎంసెట్ సహా 5 సెట్ల దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ మేరకు మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సుధీర్‌ప్రేమ్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఏపీ ఎంసెట్2020 ప్రిపరేషన్ గెడైన్స్, స్టడీ మెటీరియల్, మాక్ టెస్ట్స్, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, మోడల్ పేపర్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి.
కోవిడ్-19 కారణంగా తాము దరఖాస్తు చేయలేకపోయామని తమకు అవకాశం కల్పించాలని పలువురు అభ్యర్థులు అటు సెట్ల కన్వీనర్లు, ఉన్నత విద్యామండలి అధికారులను కోరారు. ఈ నేపథ్యంలో ఆయా సెట్లకు ఆలస్య రుసుముతో ముగిసిన గడువును పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుందని కార్యదర్శి వివరించారు. ఆయా సెట్ల పరీక్షలు ఎంసెట్ సెప్టెంబర్ 17-25 వరకు, పీజీఈసెట్ సెప్టెంబర్ 28-30 వరకు, ఎడ్‌సెట్, లాసెట్ అక్టోబర్ 1న, పీఈసెట్ అక్టోబర్ 2-5 వరకు జరగనున్నాయి.
వివరాలివీ..
సెట్ | ఆలస్యరుసుము | దరఖాస్తు గడువు |
ఎంసెట్ | రూ.10 వేలు | సెప్టెంబర్ 15 |
పీజీఈసెట్ | రూ.2 వేలు | సెప్టెంబర్ 23 |
ఎడ్‌సెట్ | రూ.500 | సెప్టెంబర్ 25 |
లాసెట్ | రూ.2 వేలు | సెప్టెంబర్ 25 |
పీఈసెట్ | రూ.500 | సెప్టెంబర్ 25 |