ఏపీ ఎంసెట్ రెండో విడతలో 32,855 సీట్లు ఖాళీ
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్-2018 రెండో విడత కౌన్సెలింగ్‌లో జూలై 7న అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. రెండో విడత కౌన్సెలింగ్ ముగిసేసరికి 32,855 సీట్లు మిగిలిపోయాయి.
ఎంసెట్‌లో 1,33,228 మంది ఉత్తీర్ణత సాధించగా రెండు విడతలకు కలిపి సర్టిఫికెట్ల పరిశీలనకు 1,17,627 మంది హాజరయ్యారు. మొత్తం 460 కాలేజీలుండగా కన్వీనర్ కోటా సీట్లు 95,455 ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు 62,600 భర్తీ కాగా ఇంకా 32,855 మిగిలి ఉన్నాయని కన్వీనర్ జీఎస్ పండాదాస్ పేర్కొన్నారు. జేఈఈ ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన పిదప మరో దఫా కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు. అలాగే బైపీసీ స్ట్రీమ్ విద్యార్ధుల కోసం కౌన్సెలింగ్ ఎంబీబీఎస్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్ ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యాక చేపట్టనున్నారు.
Published date : 09 Jul 2018 02:27PM