Skip to main content

ఏపీ ఎంసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీ ఎంసెట్-2019 కౌన్సెలింగ్‌లో భాగంగా ఆగస్టు 14న రెండో విడత సీట్ల కేటాయింపు చేశారు.
ఎంసెట్‌లో 1,32,983 మంది అభ్యర్థులు అర్హత సాధించగా వారిలో 68,508 మంది ఫీజు చెల్లించి ధ్రువపత్రాల పరిశీలనలో పాల్గొన్నారు. 67,915 మందిని అర్హులుగా తేల్చారు. వీరిలో రెండో విడత కౌన్సెలింగ్‌లో 34,036మంది ఆప్షన్లు నమోదు చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి కన్వీనర్ కోటా సీట్లు 1,06,030 ఉండగా రెండు విడతల్లో 60,862 సీట్లు భర్తీ కాగా, ఇంకా 45,168 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇంజనీరింగ్‌లో 40,949, ఫార్మసీలో 3,674, ఫార్మాడీలో 545 సీట్లు మిగిలిపోయాయి. ఈడబ్ల్యూఎస్ కోటాకింద ఉన్న సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేశారు. ఈ కోటాలో మొత్తం 9,560 సీట్లున్నాయి.4,016 మందికి సీట్లు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లనూ కన్వీనర్ కోటాలోనే భర్తీ చేశారు.రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో చేరుతున్నట్లుగా ముందుగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి అనంతరం ఆగస్టు 19లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ ఎ.బాబు తెలిపారు.
Published date : 15 Aug 2019 03:13PM

Photo Stories